Logo

కీర్తనలు అధ్యాయము 141 వచనము 3

సామెతలు 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.

కీర్తనలు 5:3 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.

నిర్గమకాండము 30:7 అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.

నిర్గమకాండము 30:8 మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.

నిర్గమకాండము 30:9 మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీయమునైనను దానిమీద పోయకూడదు.

నిర్గమకాండము 30:34 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని

నిర్గమకాండము 30:35 వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.

నిర్గమకాండము 30:36 దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము నెదుట దాని నుంచవలెను. అది మీకు అతిపరిశుద్ధముగా ఉండవలెను.

నిర్గమకాండము 30:37 నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను.

నిర్గమకాండము 30:38 దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

లేవీయకాండము 10:1 అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా

లేవీయకాండము 10:2 యెహోవా సన్నిధినుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతిబొందిరి.

లేవీయకాండము 16:11 అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొనివచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి

లేవీయకాండము 16:12 యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరిమళధూప చూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు

లేవీయకాండము 16:13 ఆ ధూపము మేఘమువలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను.

సంఖ్యాకాండము 16:35 మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.

సంఖ్యాకాండము 16:46 అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా

సంఖ్యాకాండము 16:47 మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

సంఖ్యాకాండము 16:48 అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను.

మలాకీ 1:11 తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

లూకా 1:9 యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను.

లూకా 1:10 ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా

ప్రకటన 5:8 ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువది నలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.

ప్రకటన 8:3 మరియు సువర్ణ ధూపార్తిచేత పట్టుకొనియున్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.

ప్రకటన 8:4 అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూతచేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.

కీర్తనలు 28:2 నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నాచేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము.

కీర్తనలు 63:4 నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు

కీర్తనలు 134:2 పరిశుద్ధస్థలమువైపు మీచేతులెత్తి యెహోవాను సన్ను తించుడి.

1తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైనచేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.

నిర్గమకాండము 29:39 సాయంకాలమందు ఒక గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.

నిర్గమకాండము 29:42 ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును.

1రాజులు 18:36 అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థన చేసెను యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.

ఎజ్రా 9:4 చెరపట్టబడినవారి అపరాధమును చూచి, ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నాయొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళవరకు కూర్చుంటిని.

దానియేలు 9:21 నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను.

అపోస్తలులకార్యములు 3:1 పగలు మూడుగంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,

నిర్గమకాండము 29:41 అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను.

నిర్గమకాండము 35:15 ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమున ద్వారమునకు తెర.

నిర్గమకాండము 37:29 అతడు పరిశుద్ధమైన అభిషేకతైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.

లేవీయకాండము 2:16 అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.

సంఖ్యాకాండము 28:4 వాటిలో ఒక గొఱ్ఱపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.

1రాజులు 8:28 అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి, యీ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.

1రాజులు 8:59 ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలీయులగు తన జనుల కార్యమును అవసరముచొప్పున, ఎల్లప్పుడును నిర్వహించునట్లుగా నేను యెహోవా యెదుట విన్నపము చేసిన యీ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక.

2దినవృత్తాంతములు 6:12 ఇశ్రాయేలీయులందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.

ఎజ్రా 9:5 సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవాతట్టుచేతులెతి ్త

నెహెమ్యా 8:6 ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమచేతులెత్తి ఆమేన్‌ ఆమేన్‌ అని పలుకుచు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి.

కీర్తనలు 88:2 నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మొఱ్ఱకు చెవియొగ్గుము

యెషయా 43:26 నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము.

విలాపవాక్యములు 2:19 నీవులేచి రేయి మొదటిజామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీచేతులను ఆయనతట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు

విలాపవాక్యములు 3:41 ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మనచేతులను ఎత్తికొందము.

మలాకీ 3:3 వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని యుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.

అపోస్తలులకార్యములు 10:4 అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.

1పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.