Logo

కీర్తనలు అధ్యాయము 17 వచనము 5

కీర్తనలు 119:116 నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందకయుందును గాక.

కీర్తనలు 119:117 నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను.

కీర్తనలు 119:133 నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము.

కీర్తనలు 121:3 ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.

కీర్తనలు 121:7 ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును

1సమూయేలు 2:9 తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.

యిర్మియా 10:23 యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.

కీర్తనలు 18:36 నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.

కీర్తనలు 38:16 ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించకపోదురు గాక.

కీర్తనలు 94:18 నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.

2సమూయేలు 22:37 నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.

యోబు 12:5 దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.

కీర్తనలు 16:1 దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.

కీర్తనలు 37:23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.

కీర్తనలు 37:31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.

కీర్తనలు 40:2 నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలోనుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను.

కీర్తనలు 51:12 నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.

కీర్తనలు 56:13 నేను నీకు మ్రొక్కుకొనియున్నాను నేను నీకు స్తుతియాగముల నర్పించెదను.

కీర్తనలు 73:2 నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను.

కీర్తనలు 140:4 యెహోవా, భక్తిహీనులచేతిలో పడకుండ నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షింపుము. నేను అడుగుజారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు.

సామెతలు 2:12 అది దుష్టుల మార్గము నుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలో నుండియు నిన్ను రక్షించును.

మత్తయి 26:33 అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా

లూకా 22:40 తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి.

రోమీయులకు 14:4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.