Logo

కీర్తనలు అధ్యాయము 17 వచనము 12

కీర్తనలు 7:2 వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ నన్ను తప్పించుము.

కీర్తనలు 22:13 చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు

2తిమోతి 4:17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని

1పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

సంఖ్యాకాండము 23:24 ఇదిగో ఆ జనము ఆడు సింహమువలె లేచును అది సింహమువలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగువరకు పండుకొనదు.

కీర్తనలు 10:9 గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడువారిని పట్టుకొన పొంచియుందురు బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు.

కీర్తనలు 57:4 నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులువారి నాలుక వాడిగల కత్తి.

కీర్తనలు 58:6 దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము.

సామెతలు 1:11 మాతోకూడ రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము

విలాపవాక్యములు 3:10 నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటివలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు

నహూము 2:12 తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కిపట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడిపట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను?