Logo

కీర్తనలు అధ్యాయము 52 వచనము 4

1సమూయేలు 22:18 రాజు దోయేగుతో నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీద పడి ఏఫోదు ధరించుకొనిన యెనుబది యయిదుగురిని ఆ దినమున హతముచేసెను.

1సమూయేలు 22:19 మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగవారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱలనేమి అన్నిటిని కత్తివాత హతముచేసెను.

యాకోబు 3:6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.

యాకోబు 3:7 మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతిచేత సాధు కాజాలును, సాధు ఆయెను గాని

యాకోబు 3:8 యే నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

యాకోబు 3:9 దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

నిర్గమకాండము 10:11 పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి.

కీర్తనలు 10:7 వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.

కీర్తనలు 73:9 ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును.

కీర్తనలు 109:17 శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చియున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను.

2దెస్సలోనీకయులకు 2:12 అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.