Logo

కీర్తనలు అధ్యాయము 52 వచనము 5

కీర్తనలు 7:14 పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కనియున్నాడు.

కీర్తనలు 7:15 వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను.

కీర్తనలు 7:16 వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును.

కీర్తనలు 55:23 దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచియున్నాను.

కీర్తనలు 64:7 దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు.

కీర్తనలు 64:8 వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరు తల ఊచుదురు

కీర్తనలు 64:9 మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు

కీర్తనలు 64:10 నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు.

కీర్తనలు 120:2 యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.

కీర్తనలు 120:3 మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?

కీర్తనలు 120:4 తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును

కీర్తనలు 140:9 నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక

కీర్తనలు 140:10 కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక

కీర్తనలు 140:11 కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక.

సామెతలు 12:19 నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.

సామెతలు 19:5 కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు.

సామెతలు 19:9 కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.

ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

కీర్తనలు 37:35 భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లియుండెను.

కీర్తనలు 37:36 అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.

యోబు 18:14 వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురు వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.

యోబు 20:6 వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను

యోబు 20:7 తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు. వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.

లూకా 16:27 అప్పుడతడు తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు.

లూకా 16:28 వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.

సామెతలు 2:22 భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.

కీర్తనలు 27:13 సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము

కీర్తనలు 116:9 సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.

యెషయా 38:11 యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానకపోవుదునని నేననుకొంటిని.

ద్వితియోపదేశాకాండము 29:28 యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములోనుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలు చేసెను.

1రాజులు 14:15 ఇశ్రాయేలువారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించియున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచిదేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదరగొట్టును.

2దినవృత్తాంతములు 7:20 నేను మీకిచ్చిన నా దేశములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసివేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నింద కాస్పదముగాను చేయుదును.

ఎజ్రా 7:26 నీ దేవుని ధర్మశాస్త్రము గాని, రాజుయొక్క చట్టము గాని, గైకొననివాడెవడో త్వరగా విచారణ చేసి, మరణశిక్షయైనను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తియైనను ఖైదునైనను వానికి విధింపవలెను.

యోబు 8:15 అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు.

యోబు 15:32 వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.

యోబు 21:16 వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక.

యోబు 21:28 అధిపతుల మందిరము ఎక్కడ నున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.

యోబు 28:13 నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు.

కీర్తనలు 37:10 ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.

కీర్తనలు 37:34 యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.

కీర్తనలు 37:38 భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము

కీర్తనలు 59:11 వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మాకేడెమైన ప్రభువా, నీ బలముచేత వారిని చెల్లాచెదరు చేసి అణగగొట్టుము.

కీర్తనలు 109:17 శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చియున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను.

కీర్తనలు 120:4 తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును

సామెతలు 10:30 నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు.

సామెతలు 15:25 గర్విష్ఠుల యిల్లు యెహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును.

సామెతలు 18:11 ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.

సామెతలు 21:12 నీతిమంతుడైన వాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును.

సామెతలు 24:16 నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.

ప్రసంగి 3:2 పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు,

ప్రసంగి 8:8 గాలి విసరకుండ చేయుటకు గాలిమీద ఎవరికిని అధికారములేదు; మరణదినము ఎవరికిని వశముకాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు; దౌష్ట్యము దాని ననుసరించువారిని తప్పింపదు.

యెషయా 22:25 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును దానిమీదనున్న భారము నాశనమగును ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

యిర్మియా 11:19 అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱపిల్లవలె ఉంటిని; మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.

యెహెజ్కేలు 19:12 అయితే బహు రౌద్రముచేత అది పెరికివేయబడినదై నేలమీద పడవేయబడెను, తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టిచువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను.

జెఫన్యా 1:18 యెహోవా ఉగ్రతదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడు.

లూకా 12:19 నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను.

లూకా 12:20 అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.