Logo

కీర్తనలు అధ్యాయము 84 వచనము 11

కీర్తనలు 84:1 సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు

కీర్తనలు 84:2 యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి.

కీర్తనలు 27:4 యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.

కీర్తనలు 43:3 నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును.

కీర్తనలు 43:4 అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవునియొద్దకు చేరుదును దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించెదను

కీర్తనలు 63:2 నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.

లూకా 2:46 మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి.

రోమీయులకు 8:5 శరీరానుసారులు శరీర విషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మ విషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము;

రోమీయులకు 8:6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది.

ఫిలిప్పీయులకు 3:20 మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.

యాకోబు 2:3 మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల

కీర్తనలు 17:14 లోకుల చేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండి నీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.

కీర్తనలు 17:15 నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును.

కీర్తనలు 26:8 యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను.

కీర్తనలు 26:9 పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.

కీర్తనలు 26:10 వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది.

కీర్తనలు 141:4 పాపము చేయువారితో కూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.

కీర్తనలు 141:5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను.

ఆదికాండము 13:4 తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.

నిర్గమకాండము 27:9 మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.

నిర్గమకాండము 38:9 మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారవియునైన తెరలుండెను.

ద్వితియోపదేశాకాండము 18:6 ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒకదానినుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు

2సమూయేలు 15:25 అప్పుడు రాజు సాదోకును పిలిచి దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి

2రాజులు 12:9 అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి, బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి.

2రాజులు 22:4 నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయాయొద్దకు పోయి, ద్వారపాలకులు జనులయొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము.

1దినవృత్తాంతములు 9:19 మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని యింటివారును వాని సహోదరులగు కోరహీయులును సేవాసంబంధమైన పనిమీదనుండి గుడారమునకు ద్వారపాలకులైయుండిరి; వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారైయుండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి.

1దినవృత్తాంతములు 15:23 బెరెక్యాయును ఎల్కానాయును మందసమునకు ముందు నడుచు కావలివారుగాను

1దినవృత్తాంతములు 16:42 బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను.

1దినవృత్తాంతములు 29:3 మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.

2దినవృత్తాంతములు 9:7 నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.

నెహెమ్యా 11:19 ద్వారపాలకులైన అక్కూబు టల్మోను గుమ్మములు కాయువారును నూట డెబ్బది యిద్దరు.

కీర్తనలు 42:2 నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?

కీర్తనలు 73:28 నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.

కీర్తనలు 118:24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.

కీర్తనలు 122:1 యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.

కీర్తనలు 122:9 మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.

కీర్తనలు 137:5 యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.

కీర్తనలు 137:6 నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.

సామెతలు 8:34 అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.

పరమగీతము 2:4 అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.

యెషయా 38:22 మరియు హిజ్కియా నేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను.

యెషయా 58:13 నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల

యిర్మియా 35:4 యెహోవా మందిరములో దైవ జనుడగు యిగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసికొని వచ్చితిని. అది రాజులగదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయశేయా గదికి పైగా ఉండెను.

యిర్మియా 52:24 మరియు రాజదేహసంరక్షకుల యధిపతి ప్రధాన యాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను.

యెహెజ్కేలు 40:6 అతడు తూర్పుతట్టుననున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.

మార్కు 9:5 అప్పుడు పేతురు బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను;

లూకా 2:37 యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవ చేయుచుండెను.

లూకా 15:19 ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.

లూకా 18:30 ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.

హెబ్రీయులకు 11:25 అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,