Logo

కీర్తనలు అధ్యాయము 84 వచనము 12

కీర్తనలు 27:1 యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?

యెషయా 60:19 ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

యెషయా 60:20 నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

మలాకీ 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతిసూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

యోహాను 1:9 నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.

యోహాను 8:12 మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగియుండునని వారితో చెప్పెను.

ప్రకటన 21:23 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము.

కీర్తనలు 84:9 దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము.

కీర్తనలు 3:3 యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.

కీర్తనలు 47:9 జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు.

కీర్తనలు 115:9 ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము

కీర్తనలు 115:10 అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము

కీర్తనలు 115:11 యెహోవాయందు భయభక్తులు గలవారలారా యెహోవాయందు నమ్మికయుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.

కీర్తనలు 119:114 నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను.

ఆదికాండము 15:1 ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.

సామెతలు 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.

యోహాను 1:16 ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు.

రోమీయులకు 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.

రోమీయులకు 8:17 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.

రోమీయులకు 8:18 మనయెడల ప్రత్యక్షముకాబోవు మహిమయెదుట ఇప్పటికాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

2కొరిందీయులకు 3:18 మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.

2కొరిందీయులకు 4:17 మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.

ఫిలిప్పీయులకు 1:6 నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

కీర్తనలు 34:9 యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.

కీర్తనలు 34:10 సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.

కీర్తనలు 85:12 యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును.

మత్తయి 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.

ఫిలిప్పీయులకు 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.

కీర్తనలు 15:2 యథార్థమైన ప్రవర్తన గలిగి నీతిననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.

సామెతలు 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.

సామెతలు 10:9 యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును.

సామెతలు 28:6 వంచకుడై ధనము సంపాదించిన వానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి.

సామెతలు 28:18 యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.

మీకా 2:7 యాకోబు సంతతివారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?

గలతీయులకు 2:14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవైయుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?

ఆదికాండము 6:8 అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.

ఆదికాండము 20:6 అందుకు దేవుడు అవును, యధార్థహృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు

ఆదికాండము 49:25 క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును

ద్వితియోపదేశాకాండము 18:2 వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు; యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనులవలన, అనగా ఎద్దుగాని గొఱ్ఱగాని మేకగాని బలిగా అర్పించువారివలన

ద్వితియోపదేశాకాండము 33:14 సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థములవలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన

ద్వితియోపదేశాకాండము 33:29 ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.

2సమూయేలు 12:8 నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదావారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.

2సమూయేలు 17:29 తేనె వెన్న గొఱ్ఱలు జున్నుముద్దలు దావీదును అతనియొద్దనున్న జనులును భోజనము చేయుటకై తీసికొనివచ్చిరి.

2సమూయేలు 22:3 నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.

2సమూయేలు 22:24 దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని.

2సమూయేలు 22:29 యెహోవా, నీవు నాకు దీపమైయున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.

2సమూయేలు 22:36 నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.

1రాజులు 3:13 మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటినికూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు.

1దినవృత్తాంతములు 5:20 యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను

యోబు 1:8 అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటి వాడెవడును లేడు.

యోబు 17:9 అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.

యోబు 22:25 అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును.

యోబు 29:3 అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని.

కీర్తనలు 4:5 నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి

కీర్తనలు 5:12 యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చిఉల్లసింతురు.

కీర్తనలు 7:10 దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగలవారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడైయున్నాడు.

కీర్తనలు 18:30 దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము.

కీర్తనలు 19:13 దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండ నిందారహితుడనగుదును.

కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.

కీర్తనలు 28:7 యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.

కీర్తనలు 34:22 యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.

కీర్తనలు 40:4 గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.

కీర్తనలు 59:11 వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మాకేడెమైన ప్రభువా, నీ బలముచేత వారిని చెల్లాచెదరు చేసి అణగగొట్టుము.

కీర్తనలు 73:1 ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడైయున్నాడు.

కీర్తనలు 73:24 నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు

కీర్తనలు 89:18 మా కేడెము యెహోవా వశము మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు.

కీర్తనలు 106:3 న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.

కీర్తనలు 125:4 యెహోవా, మంచివారికి మేలు చేయుము యథార్థహృదయులకు మేలుచేయుము.

సామెతలు 2:21 యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేనివారు దానిలో నిలిచియుందురు.

సామెతలు 30:5 దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.

ప్రసంగి 11:7 వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగా నున్నది.

యెషయా 10:17 ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును; అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చపొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని మింగివేయును.

దానియేలు 3:28 నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.

దానియేలు 6:22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.

మీకా 7:8 నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగిలేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును.

నహూము 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును.

మత్తయి 7:11 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవులనిచ్చును.

మార్కు 10:30 ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

లూకా 12:31 మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడ ఇవి మీకనుగ్రహింపబడును.

యోహాను 1:4 ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

రోమీయులకు 8:31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?

రోమీయులకు 8:32 తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?

2కొరిందీయులకు 6:10 దుఃఖపడినవారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.

2కొరిందీయులకు 9:8 మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.

1తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.

1తిమోతి 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైయున్నది.

1తిమోతి 6:17 ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.

తీతుకు 2:11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణ కరమైన దేవుని కృప ప్రత్యక్షమై

హెబ్రీయులకు 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

యాకోబు 1:17 శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.

2పేతురు 1:3 దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.

1యోహాను 1:5 మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.

1యోహాను 2:8 మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే.

ప్రకటన 12:1 అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను

ప్రకటన 22:5 రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతి యైనను సూర్యకాంతి యైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.